సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక తీర్మానాలు చేసే చాన్స్!

by Kema Shiva Kumar |

ఢిల్లీలోని ఇందిరా భవన్ వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది.

సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక తీర్మానాలు చేసే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఇందిరా భవన్ వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, దిగ్విజయ్ సింగ్, మీరా కుమార్, అభిషేక్ మను సింఘ్వీ, అశోక్ గెహ్లోత్ తదితరులు సహా సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సుమారు 80 మంది వరకు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా మహాత్మా గాంధీ పేరుతో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును 'జీ రామ్ జీ' (లేదా VB-G RAM G)గా మార్చిన కొత్త చట్టంలోని లోపాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అదే విధంగా పథకానికి ఉన్న మహాత్మా గాంధీ పేరు మార్చడంపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించి కొన్ని తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు, అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల సమయంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా సీడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చ జరగనుంది.

Next Story