ఊపిరి ఉన్నంత వరకు ఓట్ల చోరీ జరగనివ్వను: సీఎం మమతా బెనర్జీ

by Phanindra |   (  Updated:2025-08-28 16:11:33  IST  )

తన ఊపిరి ఉన్నంత వరకు ఓట్ల చోరీ జరగనివ్వను అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. టీఎంసీపీ వ్యవస్థాపక వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఊపిరి ఉన్నంత వరకు ఓట్ల చోరీ జరగనివ్వను: సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తాను బ్రతికున్నంత వరకు ప్రజల ఓటు హక్కును ఎవరూ దొంగిలించలేరని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. టీఎంసీ యూత్ వింగ్ (ఛాత్రా పరిషద్) వ్యవస్థాపక వేడుకల్లో మమత ఈ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షం తనతో నేరుగా పోరాడలేక, కోర్టులో ‘టీచర్స్ రిక్రూర్‌మెంట్ స్కాం’ వంటి కేసులు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆమె.. వాళ్ల పూర్వీకులు బ్రిటిష్ ఏజెంట్లని, జైళ్ల నుంచి బయటకొచ్చేందుకు బ్రిటిషర్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. టీఎంసీపీ (తృణమూల్ ఛాత్రా పరిషద్)‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. అన్యాయాలను ఏమాత్రం సహించొద్దని వారికి పిలుపునిచ్చారు.

Next Story