- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. ఆరుగురు మృతి! ఉధృతంగా ప్రవహిస్తున్న చీనాబ్ నది
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జమ్మూకాశ్మీర్ చీనాబ్ నది పరిసరాల్లో అతలాకుతలం అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు (Jammu and Kashmir) జమ్మూకాశ్మీర్ చీనాబ్ నది పరిసరాల్లో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ (cloudburst) సంభవించింది. (Doda district) దోడా జిల్లాలో మేఘావృతం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అధికారుల సమాచారం. క్లౌడ్ బరస్ట్ దెబ్బకు పలు ఇండ్లు, గోశాలలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మూడు ఫుట్ బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇటీవలే కథువా, కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే తాజాగా మరో క్లౌడ్ బరస్ట్ జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
ఈ నెల 27 వరకు జమ్మూలో ఎత్తైన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. కథువా, దోడా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు భారీ వర్ష సూచన ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే పలు ప్రభావిత ప్రాంతాల్లో రాహదారులపై రాకపోకలు నిలిపి వేశారు. జమ్మూలో నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా చీనాబ్ నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిడంతో రెస్క్యూ టీమ్ బృందాలు, అధికారులు అలర్ట్‌గా ఉన్నారు.






