కులులో క్లౌడ్‌బరస్ట్ బీభత్సం.. కూలిపోయిన కాపర్ డ్యామ్

by Naga Rani Yarlagadda |

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)పై ప్రకృతి పగబట్టిందా అన్న చందంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

కులులో క్లౌడ్‌బరస్ట్ బీభత్సం.. కూలిపోయిన కాపర్ డ్యామ్
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)పై ప్రకృతి పగబట్టిందా అన్న చందంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కులు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా కుండపోత వర్షం కురవగా.. మలానా నది (Malana River) ఉగ్రరూపం దాల్చింది. నది వరద ధాటికి మలానా -1 హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్ డ్యామ్ పూర్తిగా కూప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆకస్మిక వరద ధాటికి కార్లు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయాయి.

సుమారు 30 మంది వరదల్లో చిక్కుకోగా.. వారిలో నలుగురైదుగురు కార్మికులు హైడ్రోపవర్ ప్రాజెక్టు (Hydro Power Project)కు చెందిన సొరంగంలో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరో పాతికమంది వరదల కారణంగా బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయి పాతబడిన భవనాల్లో ఉన్నట్లు తెలిపారు. తాగేందుకు మంచినీరు కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి

Next Story