- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CJI BR Gavai: మానవ మేదస్సును టెక్నాలజీ భర్తీ చేయొద్దు.. సీజేఐ బీఆర్ గవాయ్
న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మానవ మేదస్సును టెక్నాలజీ భర్తీ చేయొద్దని సీజేఐ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మానవ మేదస్సును టెక్నాలజీ భర్తీ చేయొద్దని సీజేఐ బీఆర్ గవాయ్ (BR gavai) అభిప్రాయపడ్డారు. సాంకేతికత కేవలం డిసిషన్ తీసుకునే ఒక ఉపకరణంగా ఉండాలే తప్ప న్యాయపరమైన విలువలను భర్తీ చేసే పరిస్థితి రావొద్దని తెలిపారు. లండన్ విశ్వవిద్యాలయంలోని (Londom University) స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో జరిగిన ‘రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఆటోమేటెడ్ కాజ్ లిస్ట్‌లు, డిజిటల్ కియోస్క్‌లు, వర్చువల్ అసిస్టెంట్ల వంటి ఆవిష్కరణలను న్యాయవ్యవస్థ స్వాగతిస్తున్నప్పటికీ మానవ పర్యవేక్షణ, నైతిక మార్గదర్శకాలు, శిక్షణలు వాటిలో అంతర్భాగంగా ఉండేలా చూసుకోవాలన్నారు. భారత న్యాయవ్యవస్థ దేశ రాజ్యాంగ, సామాజిక వాస్తవాలకు అనుగుణంగా స్వదేశీ నైతిక చట్రాలను అభివృద్ధి చేయడానికి మంచి స్థితిలో ఉందన్నారు. ‘మాకు సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన దూరదృష్టి, ప్రజాస్వామ్య ఆదేశాలున్నాయి. అవి సమానత్వం, గౌరవం, న్యాయ విలువలను ప్రతిబింబించే వ్యవస్థలను నిర్మించడానికి అవసరం’ ఎంతో అవసరం అని తెలిపారు.
న్యాయవ్యవస్థలో సాంకేతికతను స్వీకరించడం ప్రారంభించినప్పటికీ కేసు నిర్వహణ సహా చట్టపరమైన పరిశోధన, డాక్యుమెంట్ ట్రాన్స్ లేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వరకు న్యాయ ప్రక్రియల్లో కృత్రిమ మేధస్సు (AI) సాధనాల ఆవిర్భావంతో జాగ్రత్త వహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఉపయోగంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అల్గోరిథమిక్ బయాస్, తప్పుడు సమాచారం, డేటా మానిప్యులేషన్, మరియు గోప్యత ఉల్లంఘనలు వంటి అంశాలపై ఆందోళనలు నెలకొన్నాయన్నారు. ఏఐ సాధనాలను సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐని స్పష్టంగా పర్యవేక్షించకపోతే కల్పిత సమాచారం, పక్షపాత సూచనలను సృష్టించగలవన్నారు. ఇటీవలి కొన్ని కేసులు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాయన్నారు. న్యాయం అందించడం కేవలం న్యాయవ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, దీని కోసం పౌర సంస్థలు, ప్రభుత్వాలు ఐక్యంగా పని చేయాలని నొక్కి చెప్పారు.






