- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Modi : మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు.. ట్వీట్ వైరల్...!
ప్రధాని మోడీ ( Prime Minister Modi )మరోసారి మాజీ కేంద్ర మంత్రి, టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)జపం చేశారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES) అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో చిరంజీవి భారతీయ సినీ రంగంలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీ ( Prime Minister Modi )మరోసారి మాజీ కేంద్ర మంత్రి, టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)జపం చేశారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES) అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో చిరంజీవి భారతీయ సినీ రంగంలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వేవ్ స్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో ఇతరుల ముందు నా పేరు ప్రస్తావించడం పట్ల చిరంజీవి ప్రధానికి తన కృతజ్జతు తెలిపారు.
ప్రధాని మోదీ వేవ్ స్ దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. మోదీ కొత్త ఆలోచనలతో సాఫ్ట్ పవర్' ప్రపంచపు శిఖరాలను త్వరలోనే దేశం చేరుకుంటుందని ఆకాంక్షించారు. భారతదేశంలోని పలు ఇండస్ట్రీలోని ప్రముఖులందరితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. స్టార్ హీరోలందరితోనూ జూమ్ మీటింగ్‌లో మాట్లాడి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జునలు పాల్గొన్నారు.
చిరంజీవి పట్ల తరచు ప్రధాని మోడీ చూపిస్తున్న అభిమానం నేపథ్యంలో ఆయనకు త్వరలోనే కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం క్రమంగా బలపడుతోంది. జనసేన పార్టీ నుంచి రాజ్యసభ కు పంపడం ద్వారా మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు సైతం చిరంజీవిని ఆహ్వానించారు. ప్రధాని మోదీతో కలిసి వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేసి సందడి చేశారు.
చంద్రబాబు నాయుడు రెండోసారి ఏపీ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సభలోనూ చిరంజీవి, పవన్ కల్యాణ్ లను మోడీ ప్రశంసించారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును దక్కించుకున్న సందర్భంగా కూడా మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.






