భారత్-పాక్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్‌పై చైనా దుష్ప్రచారం!

by Phanindra |

భారత్-పాక్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్‌పై చైనా దుష్ప్రచారం చేసింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

భారత్-పాక్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్‌పై చైనా దుష్ప్రచారం!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్ యుద్ధవిమానాలపై దుష్ప్రచారం చేయడానికి ఎంబసీలను చైనా ఉపయోగించుకుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తాము నిర్మించిన రాఫెల్ విమానాల పరపతిని దెబ్బతీసేందుకు చైనా ఇలా చేసిందని ఫ్రాన్స్ భావిస్తోంది. ‘రాఫెల్ విమానాల మార్కెట్‌ను తగ్గించేందుకు విదేశాల్లోని చైనా ఎంబసీలు తీవ్రంగా కృషి చేశాయి. ఆల్రెడీ ఆర్డర్లు ఇచ్చిన ఇండోనేషియా వంటి దేశాలతో మాట్లాడి, కొత్త ఆర్డర్లు రాకుండా చైనా అడ్డుకుంది. ఇతర దేశాలను కూడా చైనా విమానాలు కొనాలని ప్రోత్సహించింది’ అని ఫ్రెంచ్ మిలిటరీ రిపోర్టు వెల్లడించింది.

Next Story