- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: ఎల్ఏసీ సమీపంలో 5,000 కి.మీ. పొడవైన రైల్వేలైన్ నిర్మిస్తున్న డ్రాగన్ కంట్రీ
ఇందులో కొంత భాగం భారత వాస్తవాధీన నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) దగ్గరగా ఉందని ఓ మీడియా నివేదిక తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ సరిహద్దు వెంబడి చైనా మరో భారీ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ను టిబెట్‌తో కలుపుతూ చైనా అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వేలైన్‌ను నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇందులో కొంత భాగం భారత వాస్తవాధీన నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) దగ్గరగా ఉందని ఓ మీడియా నివేదిక తెలిపింది. జిన్‌జియాంగ్‌లోని హోటాన్, టిబెట్‌లోని లాసాను కలిపే రైల్వేలైన్ నిర్మాణం, కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రభుత్వ రంగ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలు ప్రాజెక్టు పనులు ఈ ఏడాది ప్రారంభమవుతాయని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం 95 బిలియన్ యువాన్లు మూలధనంతో జిన్జియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ (ఎక్స్‌టీఆర్‌సీ) అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లాసా మీదుగా 5,000 కి.మీ పొడవు ఉంటుందని హుబేకి చెందిన హువాయువాన్ సెక్యూరిటీస్ తన పరిశోధన నోట్‌లో తెలిపింది. ఇది 2035 నాటికి పూర్తవుతుందని పేర్కొంది. అయితే, ఈ రైల్వేలైన్ కొంత భాగం ఎల్ఏసీ దగ్గరగా ఉండటంతో భారత సరిహద్దు ప్రాంతంలో రక్షణకు సంబంధించి ప్రాధాన్యత పెరగనుంది. గత కొంతకాలంగా భారత్, చైనా మధ్య సైనిక ఘర్షణలపై సంబంధాలు సాధారణ స్థితికి వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.






