Pakistan: పాకిస్తాన్‎కు హ్యాండ్ ఇచ్చిన చైనా.. అమెరికా దెబ్బతో ఇప్పుడు చైనాకు భారతే దిక్కు

by Vennela |

Pakistan: భారత్ విసిరిన పంజాకు పాకిస్తాన్ విలవిలలాడుతోంది.

Pakistan: పాకిస్తాన్‎కు హ్యాండ్ ఇచ్చిన చైనా.. అమెరికా దెబ్బతో ఇప్పుడు చైనాకు భారతే దిక్కు
X

దిశ, వెబ్ డెస్క్: Pakistan: భారత్ విసిరిన పంజాకు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఇప్పటికే చైనా సైతం భారత్ పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకోమని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో యావత్ ప్రపంచానికి భారత్ ఇకపై ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం జంకే విషయమే లేదని ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ చేస్తున్న అక్రమాలకు ఇంతకాలం వంత పాడిన చైనా ఇకపై వెనకడుగు వేయడం ఖాయమైనట్టు కనిపిస్తోంది.

తాజాగా అంతర్జాతీయ పరిణామాలను చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పైన ఏకంగా 200శాతం పైన దిగుమతి సుంకాలను విధించారు. దీంతో చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు అమాంతం భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు చైనాకు సంబంధించిన పలు వస్తువులను ధరల దెబ్బతో అమెరికన్ కంపెనీలు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం చైనాలో పెద్ద ఎత్తున సంక్షోభం నెలకొని ఉంది.

చైనా వస్తువులు చాలా వరకు అమ్మకాలు నిలిచిపోవడంతో చైనాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ లాంటి పెద్ద దేశాలు మాత్రమే చైనా వాణిజ్యం చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. భారతదేశం జనాభా 150 కోట్లు, అలాగే చైనా జనాభా కూడా 150 కోట్లు పైనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాకు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా మారే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో చైనా గనుక మద్దతుగా నిలిచినట్లయితే భారతతో తెగదెంపులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది చైనా ఆర్థిక విధానాలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న చైనాకు, భారత్ కూడా దూరమైనట్లయితే ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశాలతో సన్నిహితంగా ఉండటం వల్ల భారత్ తో కోరిక బియ్యం తెచ్చుకోవడం అవుతుందని విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చైనా ఆచితూచి స్పందించింది. పాకిస్తాన్ కు పూర్తిగా వత్తాసు పలకలేదు. దీనికి తోడు చైనా కూడా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెద్ద ముప్పుగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వంటి దేశంతో సన్నిహితంగా ఉండటం వల్ల నష్టమే తప్ప లాభం లేదని చైనా విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామిగా మారబోతోంది. అమెరికాతో సాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల, భారత్ ప్రాధాన్యత పెరిగిందని అటు విదేశాంగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Next Story