చైనా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు ఓ 'వాటర్ బాంబ్'

by Ajay Maddhiboyina |

60 వేల మెగా వాట్ల సామర్థ్యంతో యార్లంగ్ త్సాంగ్పో నదిపై భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఆ నది అరుణాచల్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా మారుతుంది.

చైనా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు ఓ వాటర్ బాంబ్
X

- ఆందోళన వ్యక్తం చేసిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం

దిశ, నేషనల్ బ్యూరో:

చైనా నిర్మిస్తున్న అతి భారీ ప్రాజెక్టుపై అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఆందోళన వ్యక్తం చేశారు. టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై నిర్మిస్తున్నఅతి భారీ హైడ్రోపవర్ డ్యామ్‌ను భవిష్యత్‌లో చైనా 'వాటర్ బాంబ్'లాగా ఉపయోగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణం, భద్రత అనే అంశంపై అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం జరిగిన సెమినార్‌లో పెమా ఖండూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 60 వేల మెగా వాట్ల సామర్థ్యంతో యార్లంగ్ త్సాంగ్పో నదిపై భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఆ నది అరుణాచల్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా మారుతుంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిగా పేరు మార్చుకొని బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది. ఈ మెగా ప్రాజెక్ట్ కారణంగా సియాంగ్, బ్రహ్మపుత్ర పరివాహక ప్రదేశాల్లోని జీవావరణ దెబ్బ తినే అవకాశం ఉంది. అలాగే ఈ నది వెంటన జీవిస్తున్న ఆదివాసీలతో పాటు లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఖండూ చెప్పారు. చైనా కార్యాకలాపాలను గమనించే సియాంగ్ నదిపై మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మించాలని మేం భావించా. 11 వేల మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేయబోతున్నామని అన్నారు. చైనా నిర్మిస్తున్న డ్యామ్‌ను ఉపయోగించి నీటిని నియంత్రించే వీలుంటుంది. దీని వల్ల తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు నీటిని ఆపేస్తే దిగువన కరువు సంభవిస్తుంది. వర్షాకాలంలో ఒక్క సారిగా వరదను వదిలితే.. కింద పంటలు, ఊర్లు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యామ్‌ను ఒక వాటర్ బాంబ్‌లాగా చైనా ఉపయోగించే వీలుంటుందని ఖండూ ఆందోలన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఇప్పటికే దౌత్య పరంగా దీనిపై చర్చలు జరుపుతుంది. కానీ ముందు జాగ్రత్తగా తాము కూడా కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఖండూ వివరించారు.

Next Story