Chandrayaan-4 : 2027లోనే చంద్రయాన్-4 ప్రయోగం

by Y. Venkata Narasimha Reddy |

చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా 2027లో భారత్ చంద్రయాన్ -4 (Chandrayaan-4)మిషన్‌ను ప్రారంభించనుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్(Science and Technology Minister Jitendra Singh)మీడియాకు వెల్లడించారు.

Chandrayaan-4 : 2027లోనే చంద్రయాన్-4 ప్రయోగం
X

దిశ, వెబ్ డెస్క్ : చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా 2027లో భారత్ చంద్రయాన్ -4 (Chandrayaan-4)మిషన్‌ను ప్రారంభించనుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్(Science and Technology Minister Jitendra Singh)మీడియాకు వెల్లడించారు. చంద్రయాన్-4 మిషన్ లో ఎల్వీఎం-3 రాకెట్ కు సంబంధించి రెండు వేర్వేరు ప్రయోగాలు ఉంటాయని.. ఈ మిషన్ లో ఐదు వేర్వేరు పరికరాలను మోసుకెళ్లి కక్ష్యలో సమీకరించబడతాయని చెప్పారు.

అలాగే 2026లోనే గగన్ యాన్ మిషన్(Gaganyaan Mission)లో భారత వ్యోమగాములను ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో భూమి దిగువ కక్ష్యకు పంపించి సురక్షితంగా తిరిగి తీసుకురావడం జరుగుతుందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇందులో రోబోట్ వ్యోమ్ మిత్రను సైతం పంపనున్నట్లు పేర్కొన్నారు. 2026లోనే భారత్ సముద్రయాన్(Bharat Samudrayan) ప్రయోగం కూడా నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను జలాంతర్గామిలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్తారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సముద్రయాన్ మిషన్ గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశారు.

దేశ ఆర్థిక వృద్ధి కోసం సముద్ర గర్భంలోని కీలకమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర జీవ వైవిధ్యం వంటి విస్తారమైన వనరులను గుర్తించడంలో ఈ మిషన్ ప్రాముఖ్యత గురించి కేంద్ర మంత్రి చెప్పారు. త్వరలోనే భారత్ స్పేస్ సెక్టార్ లో సూపర్ పవర్ గా ఎదగబోతుందన్నారు. భారతదేశ స్పేస్ ఎకానమీ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల విలువ ఉందని.. వచ్చే దశాబ్దం నాటికి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని తెలిపారు. గత పదేళ్లకాలంలో భారత అంతరిక్ష రంగం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు విస్తరించినట్లు పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ రాకెట్లను నింగిలోకి పంపేందుకు వీలుగా మూడో లాంచ్ ప్యాడ్ ను శ్రీహరికోటలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇస్రోని 1969 స్థాపించగా..1993 వరకు తొలి లాంచ్ ప్యాడ్ ను స్థాపించేందుకు రెండు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందన్నారు. రెండో లాంచ్ ప్యాడ్ ను 2004లో నిర్మించారని, అందుకు మరో దశాబ్దం పట్టిందన్నారు. చిన్న ఉపగ్రహాల కోసం తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో కొత్త ప్రయోగ వేదిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి... శ్రీహరికోట స్పేస్ సెంటర్ ను విస్తరిస్తున్నట్లు తెలిపారు.

Next Story