ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. డీఏ పెంపు

by Dishanational4 |
ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. డీఏ పెంపు
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర సర్కారు దాదాపు కోటిమందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రస్తుతం బేసిక్ పేలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 46 శాతం ఉండగా.. దాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే డీఏ పెంపును పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.ఈమేరకు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) యొక్క అదనపు వాయిదాను విడుదల చేసే ప్రపోజల్‌కు పచ్చజెండా ఊపింది. కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత ఈవివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.

డీఏ, డీఆర్‌లను పెంచుతూ..

డీఏ, డీఆర్‌లను పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కేంద్ర సర్కారుపై సంవత్సరానికి రూ.12,869 కోట్ల భారం పడుతుందన్నారు. 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ పెంపు వల్ల ప్రభుత్వంపై దాదాపు రూ.15,014 కోట్ల భారం పడుతుందని చెప్పారు. డీఏ పెంపులో భాగంగా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యూటేషన్ అలవెన్స్‌లు సగటున 25 శాతం మేర పెరిగాయి. బేసిక్ పేలో ఇంటి అద్దె అలవెన్స్ వివిధ కేటగిరీలకు 27 శాతం, 19 శాతం, 9 శాతం నుంచి వరుసగా 30 శాతం, 20 శాతం, 10 శాతానికి పెరిగింది. గ్రాట్యుటీ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రయోజనాలను సైతం ప్రస్తుతమున్న రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు దాదాపు 25 శాతం మేర పెంచారు. కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన వివిధ అలవెన్సుల పెంపు వల్ల సర్కారీ ఖజానాపై ఏటా దాదాపు రూ.9,400 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ డీఏ, డీఆర్ పెంపు నిర్ణయం.. 67.95 లక్షల మంది పెన్షనర్లతో పాటు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది అనే మాట వాస్తవం.

ప్రతీ మహిళకు గుడ్ న్యూస్ ఇదిగో

కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సబ్సిడీ పథకం అమలు వ్యవధిని మరో ఏడాది పాటు పొడిగించింది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఎల్‌పీజీ సబ్సిడీని ప్రతీ సిలిండర్‌పై రూ.300కు పెంచారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ రాయితీని వర్తింపజేయాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో అదనపు ఎల్‌పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనికి రూ.1650 కోట్ల ఖర్చువుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. జనపనారకు కూడా కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపారు. జనపనార మద్దతు ధర ఇప్పుడు ఉన్నదానికంటే కూడా 285 రూపాయల మేర కేంద్ర సర్కారు పెంచింది. దీంతో క్వింటాల్ జనపనార ధర రూ. 5,335కు చేరింది.


Next Story

Most Viewed