పార్లమెంటులో 'SIR' పై చర్చకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎన్నికల సంస్కరణ ప్రక్రియ 'SIR' పై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది.

పార్లమెంటులో SIR పై చర్చకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎన్నికల సంస్కరణ ప్రక్రియ 'SIR' పై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. కాగా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉండటమే కాదు, అఖిలపక్ష సమావేశంలోనూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయని సమాచారం. అనుకున్నట్టు గానే సమావేశాలు మొదలైన రెండవ రోజే లోక్‌సభలో 'SIR' పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేయగా.. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. లోక్‌సభలో డిసెంబర్ 9, 10 తేదీల్లో ఈ అంశాలపై విస్తృత చర్చ జరిపేందుకు నిర్ణయించింది.అంతే కాదు.. డిసెంబర్ 8న ‘వందే మాతరం’ 150వ సంవత్సరోత్సవంపై కూడా చర్చిస్తామని పేర్కొంది.

'SIR' అంటే ఏమిటంటే..

ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ అనేది ఎన్నికల ఓటర్ల జాబితా సంస్కరణ ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వంటి 9 రాష్ట్రాలతోపాటు మరో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేస్తోంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ద్వారా సర్వే చేస్తూ.. ఓటర్ల జాబితాను సరి చేస్తోంది. కాంగ్రెస్, TMC, CPI(M) వంటి విపక్షాలు SIRను ‘ఎన్నికల మోసం’గా ఆరోపిస్తున్నాయి. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు జరగడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూరుస్తుందని అంటున్నాయి. BLO లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో 'SIR' పై చర్చ జరపాలని పట్టు పట్టిన విపక్షాలు.. లోక్‌సభలో 'వోట్ చోర్, గద్ది చోడ్' నినాదాలు చేసాయి.

Next Story