- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కంటెంట్ తొలగించండి: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం వార్నింగ్
అశ్లీల, అసభ్య, పోర్నోగ్రాఫిక్, పిల్లల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన (పెడోఫిలిక్), ఇతర అక్రమ కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు హెచ్చరిక జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అశ్లీల, అసభ్య, పోర్నోగ్రాఫిక్, పిల్లల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన (పెడోఫిలిక్), ఇతర అక్రమ కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 79 పాటించాలి
డిసెంబర్ 29, 2025న జారీ చేసిన సలహాలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా సంస్థలు తమ కంప్లయన్స్ వ్యవస్థలను వెంటనే సమీక్షించి, అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం తగిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది.
ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే చర్యలు తీసుకోవాలి
కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సమాచారం అందిన వెంటనే నిర్దేశిత గడువులోపు అక్రమ కంటెంట్‌ను తొలగించాలని, లైంగిక కంటెంట్‌పై ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ చట్టం లేదా 2021 ఐటీ రూల్స్‌ను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థలపై ఐటీ చట్టం, భారత న్యాయ సంహిత (BNS) తదితర చట్టాల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.






