- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంటు కమిటీల పదవీకాలం పొడిగింపు?.. విపక్షాల ప్రతిపాదనపై కేంద్రం సమీక్ష
పార్లమెంటు కమిటీల పదవీకాలం పొడిగించాలన్న విపక్షాల ప్రతిపాదనపై కేంద్రం సమీక్ష నిర్వహిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు స్టాండింగ్ కమిటీల పదవీ కాలాన్ని రెండేళ్లకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపక్షం చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా చేస్తే బిల్లులు, చట్టాలపై మరింత సూక్ష్మ పరిశీలన సాధ్యమవుతుందని విపక్షాలు సూచించాయి. సాధారణంగా ఒక ఏడాది గడువుండే పార్లమెంటరీ కమిటీల్లో చాలా వాటి గడువు ఈ నెలతో తీరనుంది. ప్రస్తుతం పార్లమెంటులో 24 స్టాండింగ్ కమిటీలు ఉండగా.. ఒక్కో కమిటీలో 31 మంది సభ్యులున్నారు. వీరిలో 21 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ఉన్నారు.
వీటిలో విదేశాంగ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీకి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఉన్నారు. గతేడాది సెప్టెంబరు 26న ఆయన్ను ఈ పదవిలో నియమించారు. కేంద్రం కనుక పార్లమెంటు కమిటీల పదవీకాలాన్ని పొడిగిస్తే.. థరూర్ సహా ప్రస్తుతం కమిటీ చైర్‌లుగా ఉన్న వారే మరో ఏడాది ఈ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.






