SIR ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

దొంగ ఓట్లను గుర్తించడానికి, వాటిని సరిచేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision) అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే.

SIR ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగ ఓట్లను గుర్తించడానికి, వాటిని సరిచేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision) అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతంగా పూర్తయిందని స్పష్టం చేసింది. మరో 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ సర్వేలో చనిపోయిన వారు, బదిలీ చేయబడిన వారి ఓటర్లను తొలగిస్తున్నట్లు చెప్పింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే SIR కార్యక్రమ లక్ష్యమని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణలు తప్పనిసరి అని పేర్కొంది. గతంలో 21 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తుచేసింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితా సీజ్ చేస్తామని సీఈసీ కీలక ప్రకటన చేసింది. మరోవైపు ఈ SIR కార్యక్రమాన్ని విపక్షాలు వ్యకిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Next Story