Central cabinet : రేపు కేంద్ర కేబినెట్ సమావేశం

by Y. Venkata Narasimha Reddy |

రేపు(Tomorrow) కేంద్ర కేబినెట్(Central cabinet) సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఉదయం 10:30కు జరుగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది.

Central cabinet : రేపు కేంద్ర కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు(Tomorrow) కేంద్ర కేబినెట్(Central cabinet) సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఉదయం 10:30కు జరుగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే పలు ప్రాజెక్టులు, అభివద్ధి పథకాలకు కేబినెట్ నిధులు మంజూరు చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఇస్తున్న హామీల మేరకు కేబినెట్ లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ , జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది.

Next Story