- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CEC: బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్న ఈసీ.. ప్రతిపక్ష నేతల ఆగ్రహం
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్ (ఎస్ఐఆర్), ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించిన సమస్యలపై విపక్ష నేతలు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సహా ఇతర పార్టీ నాయకులు సోమవారం ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సీపీఎం నాయకుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతి విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఓటు చోరీ, ఎస్ఐఆర్ వివాదంపై సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల సంఘం తీరు సరిగాలేదని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టారు: గౌరవ్ గొగోయ్
రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వలేదని, తన బాధ్యత నుండి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ‘ఓటు హక్కు అనేది సాధారణ పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కు. ప్రజాస్వామ్యం దానిపై ఆధారపడి ఉంటుంది. దానిని రక్షించడానికి ఉద్దేశించిన సంస్థ ఈసీ’ అని అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఈసీ సమాధానం ఇచ్చి ఉండాలన్నారు. రాజకీయ పార్టీలతో చర్చించకుండా, ఎన్నికలకు కేవలం మూడు నెలల టైం ఉన్నప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టారో ఈసీ చెబితే బాగుండేదని తెలిపారు. ఎస్ఐఆర్ ఎందుకు చేశారనే దానిపై ఈసీ దగ్గర సమాధానం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎస్పీ నేత రాం గోపాల్ యాదవ్ లు పాల్గొన్నారు.






