- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..మిలిటరీ సంసిద్ధత ముఖ్యం: సీడీఎస్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, అన్ని వేళలా మిలిటరీ సంసిద్ధత చాలా ముఖ్యం అని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ కొనసాగుతోందని, కావున భారత మిలటరీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని, ఏడాది పొడవునా హైఅలర్ట్‌లో ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సుబ్రతో పార్క్ వేదికగా జరిగిన ‘ఏరోస్పేస్ పవర్: ప్రిజర్వింగ్ ఇండియాస్ సావరినిటీ అండ్ ఫర్దరింగ్ నేషనల్ ఇంట్రస్ట్స్’ అనే సెమినార్‌లో సీడీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. యుద్ధంలో రన్నరప్‌లు ఉండరని, ప్రతి మిలిటరీ నిరంతరం అలర్ట్‌గా ఉండాలని, ఎలాంటి ఆపరేషన్లు చేయడానికైనా తక్షణమే సిద్ధమవ్వాలని వివరించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావించిన ఆయన.. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, కాబట్టి మిలిటరీ సంసిద్ధత చాలా హైఅలర్ట్‌లో ఉండాలని చెప్పారు. సైనికులు ఆయుధాలతోపాటు జ్ఞానం కూడా సంపాదించాలని సూచించారు.
Next Story






