పాక్ లో పేలుడు బీభత్సం.. వణికిపోయిన భవనాలు, వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

పాక్ లో పేలుడు బీభత్సం.. వణికిపోయిన భవనాలు, వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద ఆత్మహత్య దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో దాదాపు 69 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఇస్లామాబాద్ లో ఉన్న షియా మసీద్ పైన ( Shia Mosque in Pakistan ) ఈ ఆత్మహుతి దాడి జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ పేలుడు దాటికి సమీపంలో ఉన్న భవనాలు భూకంపం వచ్చినట్లు ఊగిపోయాయి. ఈ దారుణ సంఘటన జరగగానే జనాలందరూ ఉలిక్కిపడ్డారు.

పరుగులు తీశారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గజ గజ వణికిపోయారు జనాలు. ఇక పాకిస్తాన్ లో జరిగిన ఈ ప్రమాద సంఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఉగ్ర దాడిని ఖండించింది. మరోవైపు ఈ దాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ సర్కారు కొట్టి పారేసింది. ఇది ఇలా ఉండగా ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మహుతి సంఘటన పైన కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో నిరసనలు చేశారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులను అరికట్టడంలో పాకిస్తాన్ విఫలమైందని నిరసనకారులు మండిపడుతున్నారు. ఈ మేర‌కు అర్ధరాత్రి కాశ్మీర్ లో నిరసనలు తెలిపారు. క్లిక్

Next Story