పాఠశాలల్లో సీసీ కెమెరాలు మస్ట్.. CBSE కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

స్కూళ్లలో భద్రతపై సీబీఎస్ఈ(CBSE) కీలక ఆదేశాలు జారీ చేసింది.

పాఠశాలల్లో సీసీ కెమెరాలు మస్ట్.. CBSE కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూళ్లలో భద్రతపై సీబీఎస్ఈ(CBSE) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసింది. కనీసం 15 రోజుల ఫుటేజ్ భద్రపర్చాలని ఆదేశాల్లో పేర్కొంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలుతోపాటు అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆడియో, వీడియో రికార్డయ్యేలా కెమెరాలు ఉండాలని తెలిపింది. దీంతో విద్యార్థుల పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు.

Next Story