- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9వ తరగతికి ఓపెన్ బుక్ పరీక్షలు!
సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతికి ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించనుంది.

దిశ, నేషనల్ బ్యూరో: 9వ తరగతికి ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని జూన్ నెలలో జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ గవర్నింగ్ బాడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 9వ తరగతిలో భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్ తదితన కోర్ సబ్జెక్టుల్లో ఒక్కో టర్మ్‌కు మూడు పెన్-పేపర్ పరీక్షలు నిర్వహించాలని, దీనిలో భాగంగానే ఓపెన్ బుక్ అసెస్‌మెంట్ చేపట్టాలని సీబీఎస్ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బట్టీ పట్టే చదువుల నుంచి నేర్చుకోవడంలో పోటీతత్వం పెంచేందుకు ఈ ఓపెన్ బుక్ విధానం ఉపయోగపడుతుందని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఎఫ్‌ఎస్ఈ) భావిస్తోంది. ఓపెన్ బుక్ పరీక్షలో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, క్లాస్ నోట్స్, లైబ్రరీ పుస్తకాలు వంటి వన్నీ అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయంలో ఇవన్నీ ఉపయోగించుకొని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.






