- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ కు కౌంటర్‍గా నెహ్రూ-లేడీ మౌంట్ బాటన్ రిలేషన్ పై పుస్తకం ప్రదర్శించిన బీజేపీ ఎంపీ.. సభలో గందరగోళం
బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోక్ సభలో పుస్తకాల వివాదం దుమారం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాస్త బీజేపీ, కాంగ్రెస్ మధ్య పుస్తకాల వివాద సమావేశాలుగా మారాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయడుకు రాహుల్ గాంధీ నిన్న చైనా సరిహద్దు అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసి పుస్తకంలోని కొన్ని అంశాలు ప్రస్తావించగా ఇవాళ ఏకంగా ఆపుస్తకాన్ని పార్లమెంట్‍కు తీసుకుని వచ్చారు. దీంతో రాహుల్ గాంధీకి కౌంటర్‍గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే.. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హాయంలో జరిగిన అంశాలపై వచ్చిన పుస్తకాలను సభలో ప్రదర్శించారు. యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్, ఎమర్జెన్సీ కాలం, బోఫోర్స్ కుంభకోణం, మిత్రోంకి ఆర్కైవ్ పుస్తకాలను దూబే ప్రస్తావించారు.
నెహ్రూ-లేడీ మౌంట్ బాటన్ రిలేషన్ పై పుస్తకం:
అలాగే నవరనే పుస్తకం ఇంకా ప్రచురితం కాకముందే రాహుల్ గాంధీ ఆ పుస్తకాన్ని ప్రస్తావిస్తున్నారని కానీ నేను మాత్రం ఇప్పటికే ప్రచురితమై అందుబాటులో ఉన్న పుస్తకాలలోని అశాలను ప్రస్తావిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో నెహ్రూ-లేడీ మౌంట్ బాటన్ రిలేషన్ కు సంబంధించిన ఓ పుస్తకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిశికాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. స్పీకర్ పైకి కాంగ్రెస్ ఎంపీలు కాగితాలు విసిరివేశారు. ఇరు పార్టీల సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడటంతో లోక్ సభ రేపు ఉదయం11 గంటలకు వాయిదా పడింది.






