- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bombay HC: బాంబే హైకోర్టు జడ్జిగా బీజేపీ అధికార ప్రతినిధి !
మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న న్యాయవాది ఆరతి సాథేను బాంబే హైకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న న్యాయవాది ఆరతి సాథేను బాంబే హైకోర్టు జడ్జిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు ఆమోదం సైతం లభించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయవ్యవస్థలో పారదర్శకతను కొనసాగించడానికి సాథేను వెంటనే తొలగించాలని తెలిపాయి. ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ దీనిపై స్పందిస్తూ అధికార పార్టీ తరఫున వాదించే వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులను జడ్జిలుగా నియమిస్తే న్యాయవ్యవస్థ రాజకీయ రంగుగా మారుతుందని విమర్శించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఆరతి సాథే నియామకాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆయన కోరారు. మహారాష్ట్ర బీజేపీ మీడియా సెల్ ఇన్‌చార్జ్ నవనాథ్ బ్యాంగ్ మాట్లాడుతూ.. ఆరతి సాథే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా విధుల్లో ఉంది నిజమే, కానీ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి ముందే ఆమె పార్టీ పదవికి రాజీనామా చేశారని తెలిపారు.






