- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : కేరళ(Kerala) సీఎం నివాసానికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళ సీఎం పినరయి విజయన్(CM Pinarayi Vijayan) నివాసం క్లిఫ్ హౌసుకు నేడు బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి. ఆయన నివాసాన్ని బాంబులతో పేల్చేస్తామని తంపనూరు పోలీస్ స్టేషన్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన సీఎంవో అధికారులు, పోలీసులు.. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 4 గంటల తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు.
ఈ నకిలీ బెదిరింపు మెయిల్స్ చేసిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే సీఎం పినరయి విజయన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పేలుళ్లు జరుగుతాయని వచ్చిన బెదిరింపులతో వీటికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.






