Bomb threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

by Harish |
Bomb threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా AI657 విమానానికి ఉదయం 7.30 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకునే సమయంలో బాంబు బెదిరింపు గురించి పైలట్‌కు సమాచారం అందింది. దీంతో అధికారులు, ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. ఉదయం 7.36 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తర్వాత విమానం 8 గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ఈ విమానంలో మొత్తం 135 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

విమానంలో బాంబు గురించిన ఆనవాళ్లను తనిఖీ చేశారు. అయితే ఈ బెదిరింపు కాల్ ఎవరు చేశారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇతర విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో తరుచుగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. జూన్ 17న, దుబాయ్ వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు తప్పుడు సమాచారంతో ఢిల్లీ విమానాశ్రయానికి ఈమెయిల్ పంపినందుకు 13 ఏళ్ల బాలుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 18న జైపూర్, చెన్నై, వారణాసి సహా 41 విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

Advertisement

Next Story