- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండింగ్‌లో మోడీ 'మెలోడీ': ఫన్నీ రీల్‌తో నవ్వించిన సోనాక్షి సిన్హా
ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న 'మెలోడీ' ట్రెండ్‌కి బాలీవుడ్ స్టార్ జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కూడా చేరిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న 'మెలోడీ' ట్రెండ్‌కి బాలీవుడ్ స్టార్ జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కూడా చేరిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఇటలీ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి భారతదేశానికి చెందిన ప్రముఖ ‘మెలోడీ' (Melody) చాక్లెట్ ప్యాకెట్ను బహుమతిగా ఇవ్వడం, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ‘మెలోడీ' హ్యాష్ ట్యాగ్ సరికొత్త ట్రెండ్ మారింది. తాజాగా ఈ వైరల్ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ నటి సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ తమదైన శైలీలో ఒక ఫన్నీ రీలు రూపొందించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఇన్ ఎ ప్యారలల్ యూనివర్స్" (మరో సమాంతర ప్రపంచంలో) అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది. ఈ వీడియోలో సోనాక్షి తన భర్త జహీర్ను ఉద్దేశించి.. "నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావు?" అని ప్రశ్నిస్తుంది. దానికి జహీర్ స్పందిస్తూ.. "నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు" అని సమాధానమిస్తాడు. సోనాక్షి వెంటనే "లేదు, చెప్పు" అని అంటుంది. ఆ మరుక్షణమే జహీర్ ఎంతో డ్రామా పండిస్తూ తన జేబులో నుండి ఒక ‘మెలోడీ’ టాఫీని బయటకు తీసి, దాని ప్రసిద్ధ ట్యాగ్ లైన్ అయిన "మెలోడీ ఖావో, ఖుద్ జాన్ జావో" (మెలోడీ తినండి, మీకే తెలుస్తుంది) అని చెబుతాడు. ఆ చాక్లెట్ను సోనాక్షి భుజంపై పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చివరిలో సోనాక్షి ఆ చాక్లెట్ను అందుకుని, అతనిపైకి విసిరేస్తున్నట్లుగా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది.
వైరల్ అవుతోన్న వీడియో..
ఈ జంట షేర్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ వీడియో ఇంటర్నెట్ను ఊపేస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని, జహీర్ ట్రైమింగ్ను మెచ్చుకుంటూ నెటిజన్లు నవ్వుతోన్న ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "జహీర్ ఎప్పుడూ ఇంతే.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు", "మీ ఇద్దరి ఇంట్లో ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదు" అంటూ అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కేవలం వీరే కాకుండా బాలీవుడ్ నటి కీర్తి కర్బందా కూడా చాక్లెట్ థీమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ ట్రెండ్ భాగస్వామి అయ్యారు. అంతర్జాతీయ దౌత్య సంబంధాల నుండి పుట్టుకొచ్చిన ఈ 'మెలోడీ' ట్రెండ్... ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లోనూ సరదా వాతావరణాన్ని నింపుతోంది.






