- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో పేలుడు: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఢిల్లీ(Delhi)లోని ఎర్రకోట(Red Fort) వద్ద భారీ పేలుడు సంభవించి 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లోని ఎర్రకోట(Red Fort) వద్ద భారీ పేలుడు సంభవించి 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా.. శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా.. క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధితులు అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. మరోవైపు.. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశాయి. దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు కేంద్ర హోంశాఖ అప్పగించింది. దీంతో ఎన్ఐఏ వెంటనే రంగంలోకి దిగింది. ఘటనా స్థలికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు, సాక్ష్యాల సేకరణ, స్థానిక అధికారుల సమన్వయంతో అనుమానితుల కదలికలు, ఘటన వెనుక కుట్రను కనిపెట్టే చర్యలు చేపట్టింది.






