- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఎన్నికల్లో బీజేపీ జోరు.. సోషల్ మీడియాలో 'రస్‌మలై' ట్రెండ్.. ఎందుకో తెలుసా?
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం కంటే కూడా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'(ట్విట్టర్)లో నెటిజన్లు చేస్తున్న ‘రస్‌మలై’ ట్రెండ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం కంటే కూడా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'(ట్విట్టర్)లో నెటిజన్లు చేస్తున్న ‘రస్‌మలై’ ట్రెండ్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఒకప్పుడు అవహేళనగా వాడిన పదాన్నే ఇప్పుడు బీజేపీ శ్రేణులు విజయ సంకేతంగా వాడుతుండటం విశేషం.
'రస్‌మలై' ట్రెండ్ కారణం ఇదే..
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ముంబై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. "ముంబై అనేది అంతర్జాతీయ నగరం, అది కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన నగరం కాదు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై స్పందించిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే, అన్నామలైని ఉద్దేశించి ‘రస్‌మలై’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అన్నామలైని ట్రోల్ చేయడానికి వేదికయ్యాయి.
అన్నామలై ప్రచారం.. బీజేపీ క్లీన్ స్వీప్
శుక్రవారం విడుదలైన ఫలితాల్లో అన్నామలై ప్రచారం చేసిన వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. వార్డు 47 (మలాడ్ వెస్ట్) తేజిందర్ సింగ్ తివానా (BJYM ముంబై అధ్యక్షుడు) విజయం, వార్డు 35 యోగేష్ వర్మ విజయం, వార్డు 19 (చార్కోప్), దక్షత కౌతంకర్ ఘన విజయం సాధించారు. ఈ విజయంతో జోరు మీదున్న బీజేపీ నేత తేజిందర్ సింగ్ తివానా, రస్‌మలై ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ముంబైలో ఫలితాలు గెలుస్తాయి, అనవసరపు అరుపులు కాదు. ధన్యవాదాలు ముంబై" అంటూ రాజ్ థాకరేకు పరోక్షంగా చురకలు అంటించారు.
సోషల్ మీడియాలో వైరల్
రాజ్ థాకరే చేసిన విమర్శ తిప్పికొట్టినట్లు అవ్వడంతో, బీజేపీ కార్యకర్తలు రస్‌మలై తింటున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఎంఎన్ఎస్‌ను ట్రోల్ చేస్తున్నారు. "తీపి విమర్శే ఇప్పుడు తియ్యని విజయం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, అన్నామలైని లక్ష్యంగా చేసుకుని చేసిన 'రస్‌మలై' వ్యాఖ్య ఇప్పుడు ముంబై రాజకీయాల్లో బీజేపీ విజయ చిహ్నంగా మారిపోయింది.






