మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

by Malleboina Mahesh |

మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి, ముఖ్యంగా బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి, ముఖ్యంగా బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 286 స్థానిక సంస్థలకు (మున్సిపల్ కౌన్సిళ్లు, నగర్ పంచాయతీలు) జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం (డిసెంబర్ 21) ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలవగా, అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించాయి.

ప్రస్తుత ఫలితాల సరలి ప్రకారం పార్టీల వారీగా గెలుచుకున్న స్థానాల వివరాలు

బీజేపీ: 99 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

శివసేన (షిండే వర్గం): 44 స్థానాల్లో విజయం సాధించింది.

ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం): 31 స్థానాలను దక్కించుకుంది.

కాంగ్రెస్: 29 స్థానాల్లో గెలుపొందింది.

శివసేన (యూబీటీ - ఉద్ధవ్ సేన): 8 స్థానాలకు పరిమితమైంది.

ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం): 8 స్థానాల్లో విజయం సాధించింది.

ఈ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ పట్టును మరింత బలోపేతం చేశాయి. ముఖ్యంగా విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని కీలక మున్సిపాలిటీల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు స్పష్టమైన మెజారిటీని సాధించాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ ఫలితాలు వచ్చే జనవరి 15 న జరగబోయే ముంబయి (BMC) సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు దిక్సూచిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story