అరెస్టులకు అరెస్టులతోనే బదులిస్తా.. Mamatha Banerjee వార్నింగ్‌పై బీజేపీ ఫిర్యాదు

by Disha Web Desk 17 |
అరెస్టులకు అరెస్టులతోనే బదులిస్తా.. Mamatha Banerjee వార్నింగ్‌పై బీజేపీ ఫిర్యాదు
X

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తే.. బీజేపీ నేతలను అరెస్టు చేయిస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నాయకుడు సువేందు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నలుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైలుకు పంపినందుకు ప్రతిగా.. మొత్తం ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయిస్తాను. మా సంఖ్యను తగ్గించాలని భావిస్తే ఊరుకోను’’ అని గురువారం రోజు దీదీ చేసిన హెచ్చరికను తన కంప్లయింట్‌లో ప్రస్తావించారు.

ఒకవేళ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే, 72 గంటల పాటు ఎదురుచూసి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయిస్తామని సువేందు అధికారి వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు.

వివిధ స్కామ్‌లలో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేశాయి. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలలోనూ ఇద్దరు రాష్ట్ర మంత్రులు. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.



Next Story

Most Viewed