- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suresh rathore: లేటు వయసులో ఘాటు ప్రేమ..చిక్కుల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే
లేటు వయసులో ఘాటు ప్రేమ బీజేపీ ఎమ్మెల్యేను చిక్కుల్లో పడేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ మాజీ

దిశ, వెబ్ డెస్క్: లేటు వయసులో ఘాటు ప్రేమ బీజేపీ నేతను చిక్కుల్లో పడేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ ఓ నటిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే సురేష్ రాథోడ్‌కు వివాహం కాగా ఆమెతో విడాకులు తీసుకోకుండానే ఉర్మిళా సనావర్ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఊర్మిళా సనావర్‌తో కలిసి సురేష్ రాథోడ్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీ పార్టీకి చెందిన నేత కావడంతో పార్టీపైనా విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో పార్టీ ఆయన తీరుపై సీరియస్ అయ్యింది. క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటూ అతడికి నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లో ఈ విషయంపై స్పందించాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో యునిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉండటంతో బహుభార్యత్వం చెల్లదు. కానీ 2021లోనే సనావర్‌ను నేపాల్‌లో వివాహం చేసుకున్నానని సురేష్ రాథోడ్ చెబుతున్నారు. అప్పటికి యునిఫామ్ సిలివ్ కోడ్ అమలులో లేదని అంటున్నారు. అయినప్పటికీ ఆయనను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.






