- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి అభ్యర్థిపై త్వరలోనే నిర్ణయం
కొత్త ముఖ్యమంత్రిని ఎన్ని రోజుల్లో ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత లేదన్నారు. దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

- మణిపూర్‌లో శాంతిని పునరుద్దరించాలి
- మీడియాతో బీజేపీ ఎమ్మెల్యేలు
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో శాంతిని పునరుద్దరించడానికి వీలైనంత త్వరగా కేంద్రం స్పందించాలని ఇంచార్జి సంబిత్ పాత్రను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇంచార్జి సంబిత్ పాత్ర రెండు రోజులుగా ఇంఫాల్‌లోనే ఉంటూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో సంబిత్ పాత్ర వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి పునరుద్దరనే అజెండాగా చర్చలు జరుపుతున్నారు. కాగా.. సంబిత్ పాత్రను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్ని రోజుల్లో ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత లేదన్నారు. దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు మణిపూర్ రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, హిల్ ఏరియాస్ కమిటీ చైర్మన్ డి.గంగ్మేయ్‌ని సంబిత్ పాత్ర కలిసి చర్చలు జరిపారు. జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం వీరితో చర్చించారు.






