అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలవడమే లక్ష్యం..

by Vinod kumar |

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లలో గెలవడమే లక్ష్యమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలవడమే లక్ష్యం..
X

నాగ్‌పూర్: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లలో గెలవడమే లక్ష్యమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శుక్రవారం నాగ్ పూర్ పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా వికాస్ అగాధీ ప్రభుత్వం ఉద్ధవ్ థాక్రే ఇంటి నుంచి పనిచేసిందని, అవినీతి అడ్డాగా నిలిచిందని విమర్శించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ 150 గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ప్రజలను అవినీతి నుంచి ఉపశమనం కలిగించాయి. మధ్యతరగతి వాళ్లకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆదాయపన్ను మినహాయింపు లభించిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి గడపకు ప్రచారం చేయాలని బూత్ కార్యకర్తలను కోరారు.

Next Story