కాంగ్రెస్ హామీలనే బీజేపీ కాపీ కొట్టింది : ఖర్గే

by Disha Web Desk 17 |
కాంగ్రెస్ హామీలనే బీజేపీ కాపీ కొట్టింది : ఖర్గే
X

న్యూఢిల్లీ: ప్రజా సంక్షేమం కోసం బీజేపీకి ఒక పాలసీ కానీ.. ప్రజలను మెప్పించే హామీలు కానీ లేవని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. అలాంటివేం లేవు కాబట్టే.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలను బీజేపీ కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టే కాంగ్రెస్ తరఫున సంక్షేమ పథకాలపై హామీలను ఇస్తున్నామన్నారు. ‘‘ఎన్నికల హామీల రూపకల్పన కోసం హడావుడిగా ప్రయాస పడటం కంటే.. కాంగ్రెస్ రెడీ చేసిన రెడీమేడ్ హామీలనే కాపీ కొట్టడం బెటర్ అని ప్రధాని మోడీ, బీజేపీ భావించారు. అదే చేసి చూపించారు’’ అని ఖర్గే కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఇస్తున్న ప్రతీ హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

Next Story