Bjp: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ రెండో జాబితా రిలీజ్

by B.Srinivas |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ లిస్టులో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Bjp: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ రెండో జాబితా రిలీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ లిస్టులో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఐదుగురు మహిళలకు సైతం టికెట్ కేటాయించింది. ఢిల్లీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కపిల్ మిశ్రా(Kapil Mishra)కు కరవాల్ నగర్ (Karawal nagar) నుంచి అవకాశం ఇచ్చింది. అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కుమారుడు హర్ష్ ఖురానాను మోతీ నగర్ నుంచి బరిలోకి దింపింది. ఇక ఇతర ముఖ్య నేతల్లో నరేలా నియోజకవరగం నుంచి రాజ్ కరణ్ ఖత్రీ, తిమర్‌పూర్ నుంచి సూర్య ప్రకాష్ ఖత్రీ, ముండ్కాలో గజేంద్ర దరాల్, కిరారీ సెగ్మెంట్‌లో బజరంగ్ శుక్లాలు పోటీ చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను జనవరి 4న విడుదల చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పర్వేష్ వర్మ, ప్రస్తుత సీఎం అతిశీపై రమేష్ బిధూరిలను బరిలోకి దింపింది. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనుండగా, అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story