- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభ సభ్యుల రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీజేపీ అధిస్ఠానం బుధవారం కొత్తగా రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 12 మందితో రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ బరిలో నిలిపింది. వారిలో గుజరాత్ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ఒకరి పేర్లను వెల్లడించింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ గుజరాత్ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను నామినేట్ చేసింది. అలగే గోవింద్‌భాయ్ డొలాకియా, మయాంక్‌భాయ్ నాయ, యశ్వంత్ సిన్హ్ జలంసిమ్హాలను ఎంపిక చేసింది. ఇక, మధ్యప్రదేశ్ నుంచి ఉమేష్ నాథ్ మహారాజ్, ఎల్ మురుగన్, మాయ నరొలియా, ఉమేశ్ నాథ్, బన్సీలాల్ గర్జర్‌లను బీజేపీ అభ్యర్థులుగా వెల్లడించింది. గురువారం(ఫిబ్రవరి 15)తో రాజ్యసభ నామినేషన్లకు గడువు ముగియనుంది. ఒడిశా నుంచి ప్రస్తుత కేంద్ర రైల్వే, టెలికాం శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపిక చేసింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం అశోక్ చవాన్‌ను బీజేపీ తన రాజ్యసభ అద్భ్యర్థిగా ఎన్నుకోవడం విశేషం. ఆదివారం ప్రకటనలో బీజేపీ 14 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సగ్నతి తెలిసిందే.