- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Interesting: సొంత కంపెనీలో ఉద్యోగం కోసం గంటల తరబడి క్యూలో నిలబడిన బిలియనీర్
అమెరికాలోని (America) ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అయిన ఇన్-ఎన్-అవుట్ బర్గర్ ( In-N-Out Burger) సంస్థ యజమానురాలైన లిన్సీ స్నైడర్ (Lynsi Snyder) తన జీవితంలోని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని (America) ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అయిన ఇన్-ఎన్-అవుట్ బర్గర్ ( In-N-Out Burger) సంస్థ యజమానురాలైన లిన్సీ స్నైడర్ (Lynsi Snyder) తన జీవితంలోని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తమ కంపెనీలో ఉద్యోగం కోసం రెండు గంటల పాటు క్యూలో నిలబడినట్లు తెలిపారు. తను ఉద్యోగం సంపాదించుకోడానికి తన ఇంటిపేరు వాడుకోవటం ఇష్టం లేదని, అందుకే అందరూ టీనేజర్ల మాదిరిగానే తాను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా యజమాని కూతురిగా తను స్పెషల్ ట్రీట్మెంట్ పొందాలనుకోలేదని లిన్సీ స్నైడర్ తెలిపారు. ఆ రెస్టారెంట్ నిర్వాహకుడికి తప్ప తన గుర్తింపు ఎవరికి తెలియకపోవటంతో తన సహోద్యోగులందరూ తనతో నార్మల్‌గానే ఉండేవారని చెప్పారు. ఇక తన మొదటి ఉద్యోగంలో స్టోరులో కూరగాయలు కోయటం, కస్టమర్లకు సర్వీంగ్ చేయటం వంటి బాధ్యతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆమె మొదటి ఉద్యోగం ఆమెకు వృతిపరంగా సవాళ్లను ఎదుర్కోవటానికి, ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.
ఇక 2010లో లిన్సీ స్నైడర్ 27 ఏళ్ల వయసులోనే ఇన్-ఎన్-అవుట్ బాధ్యతలు చేపట్టారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు స్వీకరించిన లిన్సీ స్నైడర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే సంస్థ అభివృద్ధికి ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ 400వ స్టోర్‌ను ప్రారంభించింది. అంతేకాదు, 2025 నాటికి ఆమె నికర విలువ 7.3 బిలయన్ డాలర్లుగా ఉంది.
కాగా, ఇన్-ఎన్-అవుట్‌ను 1948లో లిన్సీ స్నైడర్ తాత హ్యారీ స్నైడర్ స్థాపించారు. 1976లో అతడు మరణించిన తర్వాత, ఆ వ్యాపారాన్ని వారి కుమారులు రిచ్ స్నైడర్, గై స్నైడర్ కొనసాగించారు. 1993లో రిచ్ విమాన ప్రమాదంలో మరణించాడు. 1999లో గై కూడా చనిపోయాడు.






