- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహర్ మంత్రి నియామకం
బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విదంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించించింది.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విదంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ (National Working President)ను నియమించించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ను నియమిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు ప్రకటన విడుదల చేసింది. పార్టీ యొక్క జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (National Working President) నితిన్ నబిన్‌ను అధికారికంగా నియమించింది. నితిన్ నబీన్ బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలో ఆయనకు దక్కిన ఈ ఉన్నత పదవి, జాతీయ స్థాయిలో ఆయన ప్రాధాన్యతను పెంచింది.
ప్రస్తుతం, నితిన్ నబీన్ (Nitin Nabeen) బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీహార్ ప్రభుత్వంలో ఆయన రోడ్ నిర్మాణ శాఖ (Road Construction), పట్టణాభివృద్ధి & గృహ నిర్మాణ శాఖ (Urban Development & Housing) మంత్రిత్వ శాఖల పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆయన నియామకం, రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






