గోద్రా ఘటన తర్వాత మోదీని విమర్శించా: బీహార్ గవర్నర్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 10:51:23  IST  )

గోద్రా ఘటన తర్వాత నరేంద్ర మోదీని తాను కూడా తీవ్రంగా విమర్శించానని బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గోద్రా ఘటన తర్వాత మోదీని విమర్శించా: బీహార్ గవర్నర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2002 గోద్రా (Godra) దుర్ఘటన తర్వాత అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన వారిలో తాను ఒకడినని బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ (Arif Mohammed Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ అలోక్ మెహతా రాసిన ‘రివల్యూషనరీ రాజ్: నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్’ పుస్తకావిష్కరణ సభకు గవర్నర్ ఖాన్ మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోద్రా ఘటనపై తాను తొందరపడి విమర్శలు చేశానని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన తర్వాత మోడీపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని అన్నారు. నాలుగు నెలల పాటు గుజరాత్‌లో గడిపి వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడినప్పుడు వాస్తవాలు అర్థమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు..

‘ట్రిపుల్ తలాక్‌’ అద్భుత సంస్కరణ..

నాడు నరేంద్ర మోదీని చాలా అన్యాయంగా తప్పుగా చిత్రీకరించారని, ఆయన అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన వ్యక్తి అని అరిఫ్ మహమ్మద్ ఖాన్ కామెంట్ చేశారు. మోదీ ఓ దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకుండా తన లక్ష్యాల వైపు శ్రమిస్తారని కొనియాడారు. 2019లో ‘ట్రిపుల్ తలాక్‌’ (Triple Talaq)ను నేరంగా పరిగణిస్తూ మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆయన అద్భుతమైన సంస్కరణగా అభివర్ణించారు. 50 ఏళ్ల తర్వాత దేశ ప్రజలు ఆయన చేసిన ఈ గొప్ప పనిని తప్పకుండా గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఐ సదస్సు దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ : ప్రధాని మోదీ

Next Story