Maithili Thakur: బీహార్ ఎన్నికల్లో మైథిలీ ఠాకూర్ సెన్సేషన్! అలీనగర్‌ ఇకపై సీతానగర్ పక్కా..!

by Ramesh Naini |   (  Updated:2025-11-14 10:47:22  IST  )

బీహార్‌ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న ఫేమస్ సింగర్ మైతిలీ ఠాకూర్ (25) అలీనగర్ నియోజకవర్గంలో 9,769 ఓట్ల ఆధిక్యతతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

Maithili Thakur: బీహార్ ఎన్నికల్లో మైథిలీ ఠాకూర్ సెన్సేషన్! అలీనగర్‌ ఇకపై సీతానగర్ పక్కా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Bihar elections) బీహార్‌ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న ఫేమస్ సింగర్ మైతిలీ ఠాకూర్ (Maithili Thakur) (25) అలీనగర్ నియోజకవర్గంలో 9,769 ఓట్ల ఆధిక్యతతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఆధిక్యం కొనసాగితే, ఆమె బీహార్ అసెంబ్లీలోనే అత్యంత చిన్న వయస్సు ఎమ్మెల్యేగా రికార్డు కొట్టనున్నారు. టీవీలో చిన్నప్పటి నుంచే గుర్తింపు తెచ్చుకున్న మైథిలీ ఠాకూర్, మొదటి సారిగా బరిలో నిలిచినప్పటికీ బీజేపీకే అలీనగర్‌లో చారిత్రక విజయాన్ని అందించే అవకాశం కన్పిస్తోంది.

మైథిలీ కుటుంబం పూర్తిగా భజనలు, భక్తి పాటలు పాడే ఫ్యామిలీ. బీహార్‌లో ఆమె భక్తి పాటలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. భోజ్‌పూరీ, హిందీలో భక్తి, ఫోక్ సాంగ్స్ పాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి అమ్మాయికి పిలిచి మరీ బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోడీ ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పడంతో సెన్సేషన్ అయింది. ఇక, తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంపై ఆమె కుటుంబం పూర్తిగా బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. సోదరులు రిషవ్, అయాచీ వివిధ వేదికల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రజాదరణకు దోహదపడింది. ప్రచారంలో సంస్కృతి, విద్య, యువత ఉపాధి, ఈ మూడు అంశాలపై ఆధారపడి ఆమె తన అజెండాను రూపొందించారు. అలినగర్‌ను ‘సీతానగర్’గా మార్చే ప్రతిపాదన కూడా ఆమె ముందుంచారు.

అలీనగర్‌లో ముందంజలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "నాపై ప్రజలు నమ్మకం ఉంచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం నా విజయం కాదు.. ప్రజలందరిదీ.. మహిళల కోసం నితీశ్ కుమార్ చేసిన పనులు నా ప్రయాణానికి చాలా ఉపయోగపడ్డాయి. ప్రజలకు ప్రధాని మోడీపై ఎంతో ప్రేమ, ఎన్డీఏపై ఎంతో నమ్మకం ఉంది. ఇది (అలీనగర్) ఖచ్చితంగా సీతానగర్‌గా మారుతుంది" అని పేర్కొన్నారు. వీడియో ఇదే..

Next Story