- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ వర్సెస్ రాహుల్.. ఆ రాష్ట్రంలో హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు దృష్టి సారించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు రాగానే నేతల సుడిగాలు పర్యటనలు సర్వసాధారణమే. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రచారంలో దూసుకుపోతుంటారు. త్వరలో బిహార్ అసెంబ్లీకి (Bihar Assembly Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హెలికాప్టర్లకు (Helicopter) ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఎన్డీయే, ఇండియా కూటములు తమ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. వచ్చే నెలలో ఎన్నికల హీట్ మరింత పీక్స్ కు చేరుకోబోతున్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వివిధ పార్టీల ముఖ్య నేతలు హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగించబోతున్నారు.
15 హెలికాప్టర్లను బుక్ చేసిన ఎన్డీయే:
ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ముందుగానే బుకింగ్స్ మొదలు పెట్టాయి. రోజుకు కనీసం 20 హెలికాప్టర్లను ప్రచారం కోసం వినియోగించబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రోజుకు 14-15 హెలికాప్టర్లను ఎన్డీయే నేతలు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రైవేట్ ఆపరేటర్లు హెలికాప్టర్ల రేట్లను సైతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల కోసం నేతలు భారీగా హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్ లను వినియోగించారు. పెరిగిన డిమాండ్ మేరకు విమానానికి గంటకు రూ. 4.5 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకు, హెలికాప్టర్ కు గంటకు రూ. 3.5 లక్షల వరకు వసూలు చేసినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అయితే ఈ సారి బిహార్ ఎన్నికలను ఇటు ఎన్డీయే కూటమి అటు ఇండియా కూటమి చాలెంజ్ గా తీసుకున్న నేపథ్యంలో ఇరు కూటముల మధ్య సభలో మరింత పోటాపోటీగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల వినియోగం ఏ మేరకు ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.






