- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర
19 కేజీల సిలిండర్ పైన రూ.195.50 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా LPG కొరత ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది. ప్రతి నెల ఒకటో తేదీన ధరల మార్పు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల సిలిండర్ పైన రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
గత నెలలో ఇదే సిలిండర్ పై రూ.115 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల దాదాపు మరో వంద రూపాయలు పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో గృహ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2078కు చేరింది. హైదరాబాద్ మహానగరంలో ఇదే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2301 చేరుకుంది. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.965గా కొనసాగుతోంది.






