ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్!

by Disha Web Desk 2 |
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిబాబాపై మోపిన అభియోగాలను హైకోర్టు సరిగా పరిశీలించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో 2014లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్ కోర్టు సాయిబాబా సహా ఇతర నిందితులకు జీవిత ఖైదు విధించింది. దీంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించగా సాయిబాబాతో సహా అరెస్ట్ అయిన మరో ఐదుగురిని కూడా బాంబే హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా పేర్కొంది. వీరిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తీర్పు వెలువడగానే బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టును మహారాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై శనివారం విచారించిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేసింది.

Next Story

Most Viewed