ఇషాన్ కిషన్, మహ్మద్ షమీకి ఊహించని దెబ్బ

by Gantepaka Srikanth |

భారత క్రీడాకారుల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను సోమవారం బీసీసీఐ ప్రకటించింది.

ఇషాన్ కిషన్, మహ్మద్ షమీకి ఊహించని దెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రీడాకారుల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ఇద్దరు కీలక ప్లేయర్లను కాంట్రాక్టు నుంచి తొలగించింది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.

గ్రేడ్‌-ఏ: శుభ్‌మన్‌ గిల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా.

గ్రేడ్‌-బీ: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, వాషింగ్టన్‌ సుందర్‌, కేఎల్‌ రాహుల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్య, రిషబ్ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, యశస్వీ జైశ్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌.

గ్రేడ్‌-సీ: అక్షర్‌ పటేల్‌, తిలక్ వర్మ, రింకు సింగ్‌, శివమ్‌ దూబే, సంజు శాంసన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌, ధ్రువ్‌జురెల్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నీతీశ్‌కుమార్‌రెడ్డి, అభిషేక్‌ శర్మ, సాయిసుదర్శన్‌, రవి బిష్ణోయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌.

మహిళా క్రీడాకారుల్లో వీరే..

మహిళల టీమ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మలు గ్రేడ్‌ ‘ఏ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్‌-బీలో రేణుక ఠాకుర్‌, షెఫాలీ వర్మ, రిచాఘోష్‌, స్నేహ్‌ రాణా చోటుదక్కించుకున్నారు. గ్రేడ్‌-సీ లిస్ట్‌లో రాధాయాదవ్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, ప్రతీకా రావల్‌, క్రాంతి గౌడ్‌, ఉమా ఛెత్రీ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, యస్తికా భాటియా, హర్లీన్‌ డియోల్‌, కాశ్వీ గౌతమ్‌, జి.కమలినీ, వైష్ణవి శర్మ, తేజల్‌ హసబ్నిస్‌ ఉన్నారు.

Next Story