నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 14,967 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్

by Malleboina Mahesh |

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ జారీ అయింది.

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 14,967 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS)లో ఉన్న 14,967 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో (డిసెంబర్ 4) ముగియనుంది. ఇందులో అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి వివిధ పోస్టులను బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LISC, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అవకాశం మిస్ అయితే అభ్యర్థులు సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారని, ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు మళ్లీ ఏర్పాడే అవకాశం లేదని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొవాలనుకునే అభ్యర్థులు https://www.cbse.gov.in/cbsenew/cbse.html లింక్ పై క్లిక్ చేసి వెంటనే తమ అర్హతకు తగ్గ పోస్టులకు అప్లై చేసుకొండి.

Next Story