- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు బిగ్ అలర్ట్.. పెరిగిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు
ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్లుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి వ్యక్తిగత వాహనాల ఫాస్టాగ్ వార్షిక పాస్ (FASTag Annual Pass) ధరలు పెంచనుంది. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న వార్షిక పాస్ ధర 2.5 శాతం పెరిగి రూ.3,075 కు చేరుకోనుంది. ఈ పాస్ ద్వారా దేశంలో ఉన్న 200 టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. రహదారి రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు లోపు రీఛార్జ్ చేసుకునే వారు పాత ధర రూ.3 వేలకే వార్షిక పాస్‌ను పొందే అవకాశం కల్పించారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటి వరకు సుమారు 52 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లుగా NHAI అధికారులు తెలిపారు.






