Bharat Bandh: రేపు భారత్ బంద్.. కార్మిక సంఘాల డిమాండ్లివే !

by B.Srinivas |

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Bharat Bandh: రేపు భారత్ బంద్.. కార్మిక సంఘాల డిమాండ్లివే !
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా బుధవారం10 కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, మైనింగ్, కన్‌స్ట్రక్షన్, రవాణా, వంటి ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను రద్దు చేయడం, కార్మికులకు యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును పునరుద్ధరించడం, ఉపాధి హామీ వేతనాన్ని పెంచడం, దానిని పట్టణ ప్రాంతాలకు విస్తరించడం, ఆరోగ్యం, విద్యా రంగాలను బలోపేతం చేయాలని కార్మికులు డిమాండ్లు చేస్తున్నారు.

బంద్ కారణంగా పలు సేవలకు అంతరాయం కలుగనుంది. అయితే విద్యా సంస్థలు, ప్రయివేట్ కార్యాలయాలు తెరిచే ఉండనున్నాయి. రైల్వేలోనూ సమ్మె చేయడం లేదు. కానీ పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలుస్తోంది. బందుకు పిలుపునిచ్చిన సంఘాల్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU), హింద్ మజ్దూర్ సభ (HMS), స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)తో పాటు వాటి అనుబంధ సంఘాలున్నాయి.

Next Story