- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIR ప్రక్రియపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు.. BLOలతో సమావేశం
by Ramesh Naini |
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితా సవరణ నేపథ్యంలో కోల్‌కతాలో సొమవారం బీఎల్‌ఓ అధికారులతో బెంగాల్ సీఎం సమావేశం అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ భారీ కుట్రకు తెరలేపిందని ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బీఎల్‌ఓలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది బీఎల్‌ఓలు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు.చాలా మంది ఆదివాసీ ఓట్లను చొరబాటు దారుల పేరుతో తొలగించారని ఆరోపించారు. లక్షలాది మంది ఓట్లను అన్యాయంగా తొలగిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు కోటిన్నర ఓట్లను తొలగించడానికి బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు.
Next Story






