గణాంకాలతో సిద్ధంగా ఉండండి.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

బీహార్‌లో జరగనున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా సవరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు దాఖల చేసిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

గణాంకాలతో సిద్ధంగా ఉండండి.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో జరగనున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా సవరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు దాఖల చేసిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్య కాంత్ (Justice Surya Kant), జోయ్‌మల్య బాగ్చీ (Joymalya Bagchi) ధర్మాసనం ఎదుట ఆర్‌జేడీ నాయకుడు మనోజ్ ఝా (Manoj Jha) తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలను వినిపించారు. ఓటరు జాబితా అస్తవ్యస్తంగా ఉందని, మరణించిన వారు బతికే ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు చూపారని ఆరోపించారు.

అయితే, వారి వాదనలు విన్న ఈసీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఓటరు జాబితా రూపకల్పనలో అక్కడకక్కడ లోపాలు తలెత్తడం సహజమని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఓటర్ల సంఖ్య, ఇతర సంబంధిత వివరాలతో ఎన్నికల సంఘం సిద్ధంగా ఉండాలని సూచించింది. కాగా, బీహార్ ఎన్నికల్లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆర్‌జేడీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్), సీపీఐ, ఎస్‌పీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), జేఎంఎం, సీపీఐ (ఎంఎల్), అలాగే పీయూసీఎల్, ఏడీఆర్ మరియు కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Next Story